Tuesday, November 26, 2024

KTR Twit – రాహుల్ జీ … మీ కోసం యువ‌త వెయిటింగ్

ఏడాదిలో రెండు ల‌క్ష‌లు జాబ్స్….
విద్యార్ధుల‌కు రూ.5 ల‌క్ష‌ల భ‌రోసా కార్డులు
ఇచ్చిన మీకు గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతారాట‌
రాహుల్ ఎన్నిక‌ల హామీల‌పై కెటిర్ సెటైర్
ట్విట‌ర్ల‌లో రాహాల్ ఇచ్చిన హామీల‌పై గ‌రం గ‌రం
నెర‌వేర్చ‌ని హామీల‌తో యువ‌త‌లో నైరాశ్యం

హైద‌రాబాద్ – అశోక్ నగర్‌లోని యువత ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు.

అలాగే యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చినందుకు, టీఎస్‌పీఎస్సీని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు. గ్యారంటీలను నెరవేర్చిన మిమ్మల్ని యువతను కలిసేందుకు హైదరాబాద్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీకి సంబంధించిన ట్వీట్‌ను ఇందులో ప్రస్తావించారు.

- Advertisement -

గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌కు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగులను కలిశారు. అనంతరం ఆయన ట్విట్టర్‌ వేదికగా అప్పటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైదరాబాద్‌ పర్యటనతో తనకు అర్థమైందని చెప్పారు. అందుకే తెలంగాణలో ప్రజా పాలన అధికారంలోకి రాగానే ముందుగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని తెలిపారు. అలాగే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. యూపీఎస్సీ తరహాలో టీఎపీఎస్సీని పునరుద్ధరిస్తామని.. యువ వికాసం కింద ఫీజులు, కోచింగ్ ఫీజు చెల్లింపుల కోసం 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని ప్రకటించారు. రాహుల్‌ గాంధీ మోసపూరిత మాటలను నమ్మిన యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్‌ సర్కార్‌ మాత్రం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. దీనిపై ఇప్పటికే యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివ‌రాల‌ను కెటిఆర్ త‌న ట్విట్ లో పొందుప‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement