Monday, November 25, 2024

KTR Twit – మూసిపై ముందుకు … ధాన్యం కొనుగోళ్ల‌లో వెన‌క్కు..

ఆంధ్ర‌ప్ర‌భ కథ‌నంపై స్పందించిన కెటిఆర్
రామ‌న్న పేట‌కు రైరై… కొనుగోళ్లు సెంట‌ర్ కు నైనై

హైద‌రాబాద్ – ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ధాన్యం కొనుగోళ్ల‌లో జాప్యం క‌థ‌నంపై కెటిఆర్ స్పందించారు.. దీనిపై ఎక్స్ ఖాతాలో ఆయ‌న ట్విట్ చేశారు.. మూసి పై ముందుకు వెళుతున్న ప్ర‌భుత్వం కొనుగోళ్ళపై వెనక్కు వెళుతుంద‌ని మండిప‌డ్డారు..రామన్నపేట కు రైరై మంటూ వెళ్తున్న ప్ర‌భుత్వం కొనుగోలు సెంటర్ల కొనుగోళ్ల‌కు నై నై అంటున్న‌ద‌ని ఎద్దేవా చేశారు.. ధాన్యం కొనుగోళ్లు డాం డాం అంటూ కాంగ్రెస్ కు చుర‌క‌లంటించారు.. కాంగ్రెస్ కోతలకు లెక్క లేదని, కొనుగోళ్లకు దిక్కులేదని విమ‌ర్శించారు.. ద‌ళారులకు దండిగా కొమ్ముకాస్తూ రైతన్నలకు దండగా మారుస్తున్నారి వాపోయారు. నాడు క్వింటాలుకు రూ. 2300 అమ్ముకున్న రైతు మీ పుణ్యమా నేడు రూ1800 లకు అమ్ముకుంటున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఎద్దేడ్చిన వ్యవసాయం – రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడద‌ని రేవంత్ స‌ర్కార్ ను హెచ్చ‌రించారు.

చిట్టినాయుడు… నువ్వా కెసిఆర్ పేరు తుడిచేది
రేవంత్ వ్యాఖ్యాల‌కు కెటిఆర్ ఘాటు జ‌వాబు
త‌మ‌రు చెప్పులు మోసిన రోజు..ఆయ‌న ఉద్య‌మానికి ఊపిరి పోశారు
తెలంగాణ‌కు చంపేందుకు మీరు బ్యాగ్ లు మోసిన సమ‌యంలో
కెసిఆర్ తెలంగాణ భ‌విష్య‌త్ కు ఊపిరి పోశారు..

చిట్టి నాయుడు.. నువ్వా కేసీఆర్‌ పేరును తుడిచేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. నువ్వు చెప్పులు మోసిన నాడు కెసిఆర్ ఉద్యమానికి ఊపిరి పోశాడని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోయేలా చేశానన్న రేవంత్ వ్యాఖ్యాల‌కు ఎక్స్ ద్వారా ధీటుగా స‌మాధానం ఇచ్చారు కెటిఆర్.. త‌మ‌రు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడని పేర్కొన్నారు..

- Advertisement -

మీరు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు.. ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టారని చెప్పారు. మేము సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశాడని ఎక్స్‌ వేదికగా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement