Wednesday, November 20, 2024

KTR Twit …. క్షమించు తల్లీ

తండ్రిపై దాడిని చూసి త‌ట్టుకోలేక బాలిక మృతి
ఇంట్లోకి చొర‌బ‌డి సోమ‌య్య‌పై దుండ‌గుల దాడి
తెలంగాణ ప్ర‌భుత్వంపై మ‌రో అతి పెద్ద మ‌చ్చ‌
శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌న‌డానికి ఇదే ఎగ్జాంపుల్‌
ర‌క్షించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాం.. క్ష‌మించు అంటూ ట్వీట్‌

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తన తండ్రిపై దాడిని తట్టుకోలేక బాలిక కుప్పకూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్‌ వేదికగా శ‌నివారం ఆయన పోస్ట్ చేశారు. బాలిక మృతికి సంతాపం ప్రకటించారు. ‘నిజంగా హృదయవిదారకమే! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి.. ఆమె తండ్రి సోమయ్యపై దాడి చేయడంతో 14 ఏళ్ల పావని గుండె ఆగిపోయింది. ఆమె సహాయం కోసం విలపించింది. తన తండ్రిపై దాడిని చూసి బాధ తట్టుకోలేక పావని కుప్పకూలి చనిపోయింది. ఓ కూతురికి తండ్రిగా, ఒక చిన్న అమ్మాయిని రక్షించడంలో విఫలమైనందుకు బాధగా ఉంది! ఆ కుటుంబానికి, ముఖ్యంగా తండ్రికి ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వంపై మరో పెద్ద మచ్చ ఇది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి అనేందుకు ఈ హృదయ విదారకర ఘటనే ఉదాహరణ. క్షమించండి పావని.. మేము నిన్ను రక్షించడంలో విఫలం అయినందుకు.’ అని పోస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement