Friday, October 18, 2024

KTR Twit – దామ‌గుండంలో రాడార్ స్టేష‌న్ …మూసీకి మ‌ర‌ణ శాస‌నం

హైద‌రాబాద్ – వికారాబాద్ జిల్లా దామ‌గుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేష‌న్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో రాడార్ స్టేష‌న్ ఏర్పాటును బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఓ వైపు మూసీ నదికి మరణ శాసనం రాస్తూ మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు అంటారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయన ఎక్స్ లో ట్విట్ చేశారు..

వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతరార్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమపై పదేళ్ల పాటు ఒత్తిడి చేసినప్పటికీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అంగీకరించలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రయోజనాలను ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని నిలదీశారు. రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు.

- Advertisement -

జ‌నావాసాలు లేని ఇలాంటి రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. దామ‌గుండంలో రాడార్ స్టేష‌న్‌ను తమ పార్టీ వ్య‌తిరేకిస్తోందన్నారు. గంగాన‌దికి ఒక న్యాయం మూసీకి ఒక న్యాయామా? అని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement