ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాజీమంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఓ నెటిజన్ షెడ్యూల్ కులానికి చెందిన తాను యూఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నానని అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ గతంలో పొందానని.. అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ అంశంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంబేద్కర్ ఓవర్ సీస్ స్కాలర్షిప్ రెండవ ఇన్ స్టాల్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్కను కోరారు. తెలంగాణలోని 7వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వంలో ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందారని తెలిపారు.