Tuesday, November 26, 2024

Tributes – పివికి భార‌త ర‌త్న ఇచ్చి గౌర‌వించాలి – కెటిఆర్

హైద‌రాబాద్ – అప్పుల్లో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీది అని కొనియాడారు బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ . పివి వ‌ర్దంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పివిఘాట్ స‌మాధిపై పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు… అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, పీవీ నరసింహా రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.. కాంగ్రెస్‌కు ఆయన ఎంతో సేవ చేశారని, కానీ ఆ పార్టీ పీవీకి తీరని అన్యాయం చేసిందని గుర్తుచేశారు.

మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా ఘ‌న నివాళి

మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి స్మ‌రించుకున్నారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయ‌న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, బ‌హుముఖ ప్రజ్ఞాశాలి, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడే గొప్ప మేధావి పీవీ నరసింహా రావు అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎనలేని సేవ చేశారన్నారు. దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పెంచారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement