హైదరాబాద్ – త్వరలో తాను ప్లాస్మా దానం చేయనున్నట్లు తెలిపారు మంత్రి కెటిఆర్. ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో , ‘కొవిడ్ పాజిటివ్ వస్తే వైద్య నిపుణుల సలహాలు తీసుకోండి. మానసికంగా ధృడంగా ఉండండి. న్యూస్ చానళ్లు, వాట్సాప్, ఫేస్ బుక్ పోస్టులు చూడడం మానేయండి. వీలైనంత వ్యాయామం చేయండి. వాకింగ్ అయినా చేయవచ్చు. సొంత వైద్యం మాత్రం వద్దు. కొవిడ్ తగ్గిన తర్వాత వచ్చేసమస్యలకు కూడా మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉండండి’ అని కొవిడ్ సోకిన తర్వాత తాను ఎలా కోలుకున్నానన్న దానికి సమాధానంగా వివరించారు. తాను వరుసగా వారం రోజులు స్వల్ప, అధిక జ్వరంతో బాధ పడ్డానని, తర్వాత ఊపిరి తిత్తులకు స్వల్ప ఇన్‌ఫెక్షన్ కూడా సోకిందని తెలిపారు. తాను డయాబెటిక్ పేషెంట్ కావ డంతో బ్లడ్ సుగర్స్, బీపీ నియంత్రించుకోవడం పెద్ద సవా ల్‌గా మారిందని, అయితే డాక్టర్ల సూచనలు పాటించి సాధారణ స్థితికి వచ్చానని చెప్పారు.
తన పుట్టిన రోజు సంద ర్భంగా బహుమతిగా వచ్చిన గిఫ్ట్ ఎ స్మైల్ అంబులెన్సులు ఇప్పటికే సేవలందిస్తున్నాయని చెప్పారు. ఇంటింటి సర్వే కోసం 28 వేల టీములను ఏర్పాటు చేశామని, ఇప్పటికి 60 లక్షల ఇళ్లలో పరీక్షలు చేసి 2.3లక్షల కొవిడ్ హోం కిట్లు పంపిణీ చేశామన్నారు. కొవిడ్ చికిత్సకయ్యే ఖర్చు విషయంలోప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ జీవోను ఉల్లం ఘిస్తే వాటిపై కచ్చితంగా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. బ్లాక్ ఫంగస్‌పై పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జూనియర్ డాక్టర్లకు రక్షణ పరిక రాలు, జీతాల పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. స్టాఫ్ నర్సుల నియామకం, తార్నాక, ఓయూ హెల్త్ సెంటర్‌లను కోవిడ్ చికిత్స కోసం వాడే అంశాన్ని వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు.
త్వరలో ప్లాస్మా దానం చేస్తా – కెటిఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement