దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ 9 శాతానికి మించిన వృద్ధి రేటు సాధిస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితుల వల్లే అది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రాష్ట్ర అభివృద్ధిని గుర్తించినందుకు నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్కు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement