Friday, November 22, 2024

Scams Party – ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న ద‌గుల్బాజీ పార్టీ కాంగ్రెస్ – కెటిఆర్

హైదరాబాద్‌: వైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ,,దివ్యాంగుల కోసం తొమ్మిదిన్నరేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ 3 నుంచి 4 శాతానికి పెంచినట్లు గుర్తు చేశారు. ”దివ్యాంగులకు ప్రస్తుతం రూ.4,016 పింఛన్‌ ఇస్తున్నాం. కేసీఆర్‌ మళ్లీ సీఎం కాగానే రూ.6,016కు పింఛన్‌ పెంచుతాం. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ఇస్తున్న పింఛన్‌ రూ.1,100. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4 వేలు పింఛన్‌ ఇవ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఇస్తుందా? ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లో భాజపా సర్కారు ఇస్తున్న పింఛన్‌ రూ.600 నుంచి రూ.వెయ్యి మాత్రమే. కాంగ్రెస్‌ ఒక్క ఛాన్స్‌ కాదు.. 11 సార్లు అవకాశం ఇచ్చారు” అని కేటీఆర్‌ అన్నారు.

ఇక రాజ‌కీయాల‌పై మాట్లాడుతూ బీజేపీకి బీ టీమ్ అని రాహుల్ గాంధీ అంటున్నార‌ని . అయితే తామ బీజేపీ బీ టీమ్ కాదు.. మీరు ఈ దేశానికి సీ టీమ్. సీ టీమ్ అంటే ఏంది.. చోర్ టీమ్ మీరు.. చోర్ టీమ్ అని కేటీఆర్ విమ‌ర్శించారు. ఏ టు జడ్ కుంభ‌కోణాలు చేసిన ద‌గుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఏ అంటే ఆద‌ర్శ్, బీ అంటే భోఫోర్స్, సీ అంటే కామ‌న్వెల్త్.. ఇలా చెప్పుకుంటూ పోతే జ‌డ్ దాకా ఉన్నాయి. ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న పార్టీ, ద‌గుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వ‌జ‌మెత్తారు. ఆకాశంలో ఎగిరే అగ‌స్త్య హెలికాప్ట‌ర్ నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వ‌ద‌ల‌కుండా దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కుంభ‌కోణాల్లో స్వ‌యంగా మీ కేంద్ర మంత్రులు జైళ్ల‌కు పోయారు. ఇవాళ ఆఖ‌రికి నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ విచార‌ణ జ‌రుగుతోంది. మేం బీ టీమ్ కాదు.. ఈ దేశానికి మీరే సీ టీమ్. రేప‌టి రోజున అల్టిమేట్‌గా.. ఇక్క‌డ ప‌ది మంది గెలిచినా, ప‌న్నెండు మంది గెలిచినా.. వారిని రేవంత్ రెడ్డి తీసుకెళ్లి బీజేపీలో గంప‌గుత్త‌గా చేరుతాడు. ఇవాళ రాసిపెట్టుకోండి.. మీడియా ముఖంగానే చెబుతున్నాను. రేవంత్ రెడ్డి సంగ‌తి మీకు తెలియ‌దు రాహుల్ గాంధీ. రేవంత్ బీజేపీ కోవ‌ర్ట్. కాంగ్రెస్‌లో బీజేపీ ఏజెంట్ ఆయ‌న‌. బీజేపీ తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఇరికించింది. మీకు తెలియ‌క గాడ్సేకు గాంధీ భ‌వ‌న్‌ను అప్ప‌జెప్పారని రాహుల్ గాంధీపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement