అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల, కామారెడ్డిలలో రోడ్‌షో నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం సిరిసిల్ల పట్టణానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం పట్టణంలో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.