మహాదేవపూర్, ప్రభన్యూస్ : దక్షిణ అరణ్య శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర వారి దేవస్థానంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందంతో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు.
ముందుగా ఆలయ మర్యాదలతో అర్చకులు వారికీ స్వాగతం పలికారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు, శ్రీ శుభనంద (పార్వతి) అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు ఆశీర్వాదం అందజేశారు.
- Advertisement -