కేంద్రం ధాన్యం కొనుగోలు అంశంపై గత పది రోజులుగా కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ మధ్య వివాదం చెలరేగుతోంది. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మహా చేపట్టింది. ఈ మహా ధర్నాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్నా చౌక్ వద్దకు వెళ్లినప్పటికీ… ఆయన స్టేజ్ పైకి మాత్రం వెళ్లలేదు. మామూలు కార్యకర్త లాగే… జనం మధ్యంలో కూర్చోని కేటీఆర్ తన నిరసన తెలిపారు. అలాగే కేసీఆర్ కూతురు కవిత, హరీష్ రావు స్టేజ్ ఎక్కినప్పటికీ… కేటీఆర్ మాత్రం… జనాల్లోనే ఉండి ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసేలా కేటీఆర్ ఇవాళ వ్యవహరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement