Thursday, September 19, 2024

TG | కాళోజీ కలం.. సామాన్యుల గళం : కేటీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు.

ఎక్స్‌ వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘మన కాళోజీ ‘గొడవ’ ప్రజల గొడవ. అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు చేసిన రచనలు మాటల తూటాలు. నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు.

ప్రతినిత్యం సామాన్యుల సమస్యలనే, హక్కుల పరిరక్షణే, ప్రజా శ్రేయస్సునే తన జీవితంగా భావించిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ. ప్రజాకవిగా పేరొందిన కాళోజీ స్వాతంత్య్ర‌ సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు అనిర్వచనీయం. అన్నారు

ధిక్కార స్వ‌రానికి సమున్న‌త గౌర‌వం..

మన కాళన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే మహోన్నత ఉద్దేశంతోనే ఉద్య‌మ నేత‌, మాజీ సీఎం కేసీఆర్ కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారు. వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ధిక్కార స్వరం కాళోజీ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం.’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement