రాజన్న సిరిసిల్ల : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు , జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి.పాల్గొన్నారు
ఈ కార్యక్రమం అనంతరం బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.