సమైక్య పాలనలో కరువు కాటకాలకు.. వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా మారింది. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో.. పడావుబడ్డ పాలమూరు నేల.. పసిడి పంటలతో సస్యశ్యామలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అసమర్థత వల్ల వెనుకపడేయబడ్డ పాలమూరు ప్రాంతం .. కేసీఆర్ పరిపాలనలో సుభిక్షంగా మారిందన్నారు. మహబూబ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డ గులాబీ జెండా.. ఈ గడ్డపై మరోసారి ఎగరాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి, పాలమూరు ముద్దుబిడ్డ మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓటర్లను కేటీఆర్ కోరారు.
- Advertisement -