Monday, July 22, 2024

KTR – గోపన్ పల్లి ఫ్లై ఓవర్ కు గ్ర‌హ‌ణం..

పూర్తి అయినా ప్రారంభానికి నోచుకోని వైనం
ఎత్తి చూపిన మాజీ మంత్రి కెటిఆర్
ఎప్పుడు ప్రారంభిస్తారంటూ నిల‌దీత .
ఢిల్లీ చ‌క్కెర్లు ఆపి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై
శ్ర‌ద్ద పెట్టాలంటూ చుర‌క‌లు ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ ప్ర‌తినిథి – గోపన్ పల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తైన ప్రారంభించకపోవటంపై కేటీఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో నేడు ట్విట్ చేశారు.. సీఎం కు ఢిల్లీకి చక్కర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరగటం ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా? అంటూ నిల‌దీశారు.. వెంటనే గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించాల‌ని, లేదంటే ప్రజలే ప్రారంభించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

- Advertisement -

బిఆర్ఎస్ ప్ర‌భుత్వంలోనే నిర్మాణం పూర్తి

హైదరాబాద్ లోని గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసింద‌న్నారు కెటిఆర్ . ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయ‌ని వివ‌రించారు. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసిందంటూ . కానీ ఇప్పటికీ ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నార‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. . ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందని అస‌హనం వ్య‌క్తం చేశారు.

గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించేందుకు సీఎం సమయం లేకుండా పోయిందని,. ఎందుకంటే ఆయన ఢిల్లీ చుట్టు షటిల్ సర్వీస్ లు చేయటానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇళ్ల చుట్టు తిరగటంలోనే బిజీగా ఉన్నారంటూ సెటైర్ వేశారు కెటిఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంద‌ని విమ‌ర్శించారు. వెంటనే గోపన్ పల్లి ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement