Friday, November 22, 2024

అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల‌తో కెటిఆర్ మాటామంతి..

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌సంగంతో ప్రారంభ‌మ‌య్యాయి.. ఈ ప్ర‌సంగ కార్య‌క్ర‌మానికి ముందు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ లతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎప్పుడు టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉప్పు నిప్పుల్లా మండిపడే నేతలు అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఈ నేత‌లు సఖ్య‌త‌గా మాట్లాడుకున్నారు. ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ లతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

మరి ముఖ్యంగా టీఆర్ఎస్ కు గుడ్ చెప్పి బీజేపీలో చేరి హుజూరాబాద్ నుంచి మరోసారి బీజేపీగా ఎన్నిక అయిన ఈటలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, హుజూరాబాద్ అధికార కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేదు? అంటూ ఈటలన ప్రశ్నించారు కేటీఆర్. దానికి ఈటల పిలిస్తేనే కదా హాజరయ్యేది అంటూ సమాధానమిచ్చారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదంటూ పనిలో పనిగా ఈటల ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే అని కూడా చూడలేదని, కనీసం కలెక్టర్ కూడా ఆహ్వానించలేదని అన్నారు. ఈటల, కేటీఆర్ ఇలా సంభాషించుకుంటుండగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చారు. అధికారిక కార్య‌క్ర‌మాల‌కు ఈటలనే కాదు త‌న‌ను కూడా పిలవటంలేదంటూ వాపోయారు భ‌ట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement