కరీంనగర్ – రూ.:10 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో కాశ్మీర్ గడ్డ ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు మంత్రి కె తారక రామారావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రంథాలయంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో 7 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 2 కోట్ల ఎల్ఆర్ఎస్ నిధులతో ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంటర్ ప్రారంబించిన అనంతరం నూతన కౌన్సిల్ హాల్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం చేయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైఫై హాట్ స్పాట్స్, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, పలు అభివృద్ధి కార్యక్రమాల ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ వై సునీల్ రావు పాల్గొన్నారు
గోల్కొండ హస్తకళల షో రూమ్ ను ప్రారంభించిన మంత్రి
తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లో స్వంత భవనం లో ఏర్పాటు చేసిన గోల్కొండ హస్త కల షో రూం ను రాష్ట్ర పురపాలక ఇ టి శాఖ మంత్రి కే టి ఆర్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో తెలంగా హస్త కళ అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, ఎమ్మెల్సీ మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు లు పాల్గొన్నారు