కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసు
ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశం
మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్ ,
ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్ ల నుంచి ఆ వార్తలు తొలగించాలని ఉత్తర్వులు
పరువు నష్టం కేసులో ఓ మంత్రికి పై కోర్టు
ఇంత సీరియస్ అవటం ఇదే మొదటి సారి
హైదరాబాద్ – తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొంది. కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ గా పరిగణించింది.
భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు తెలిపింది.
దేశంలో ఇదే మొదటి సారి
పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. ఆయనప్పటికీ మంత్రి కొండా సురేఖ లో ఎలాంటి మార్పు రాలేదు. తన వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేసే ఏ ఆరోపణలను సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక పై తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కేసులో కోర్టు తాజా కామెంట్లతో కేటీఆర్ కు బలం చేకూరినట్లైంది.