Saturday, November 23, 2024

బిజినెస్ ఫోరం భేటీకి కేటీఆర్‌కు ఆహ్వానం

  • సెనేట్‌లో ప్రసంగించాలని రిక్వెస్ట్ చేసిన ఫ్రెంచ్ ప్ర‌భుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టా త్మక ఆహ్వానం దక్కింది. తాజాగా ఫ్రెంచ్‌ ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌ను తన సెనేట్‌లో ప్రసం గించాల్సి ఆహ్వానం పంపింది. ఈనెల 29న ఫ్రెంచ్‌ సెనెట్‌లో జరిగే యాంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో ప్రత్య క్షంగా పాల్గొని ప్రసంగించా ల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఫ్రెంచ్‌ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌ సార థ్యంలో ఏర్పాటైన ఈ సదస్సు భారత్‌ – ఫ్రెంచ్‌ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపే తానికి దోహదం చేస్తుందని ఫ్రెంచ్‌ ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో పేర్కొంది.

యాంబిష‌న్ ఇండియా-2021 స‌ద‌స్సులో..
యాంబిషన్‌ ఇండియా – 2021 సదస్సులో కీనోట్‌ స్పీకర్‌గా ‘గ్రోత్‌ – డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్టు కోవిడ్‌ ఎరా ‘అనే అంశంపై తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. గతంలో నిర్వహించిన యాంబిషన్‌ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400లకుపైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొ న్నారని, ఈసారి సైతం అంతకు మించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని తెలిపారు. ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందు కు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్‌ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్‌ కేర్‌, క్లైమేట్‌ చేంజ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఆగ్రో బిజినెస్‌ లాంటి ప్రధా నమైన అంశాలపైన ప్రత్యేక సమా వేశాలను ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు ఫ్రెంచ్‌, ఇండియా కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమా వేశాలు ఉంటాయని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ దేశ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందని, ఫ్రాన్స్‌ దేశం ఆహ్వానం తెలం గాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement