Tuesday, November 26, 2024

స్లమ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్ లోని చంచల్‌గూడ లో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్‌ను  స్లమ్ ఫ్రీ  సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెలు బస్తీలో రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ ఆలీ, మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట్ ఎమ్మెల్యే బలాల, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement