హైదరాబాద్ … ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ప్రభావశీలుర
లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్ లిస్ట్‌లో మన దేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు మంత్రి కేటీఆర్ కాగా, మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా. అయితే ఈ లిస్టులో ఎంపీ కంటే మంత్రి కేటీఆరే ముందు వరుసలో నిలబడి సత్తా చాటారు. అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్ రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ లిస్ట్‌లో కేటీఆర్ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. కాగా, ఈ లిస్టులో తెలంగాణ ఐటీ శాఖకు చెందిన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ 22వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్‌కు చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది
కెటిఆర్ కి అరుదైన గౌరవం – సోషల్ మీడియా ప్రభావశీలుర జాబితాలో చోటు..
Advertisement
తాజా వార్తలు
Advertisement