Friday, September 20, 2024

KTR Demand – ₹25 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల్సిందే

చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి
ఇండ్లు కోల్పోయి, డ్యామేజ్​ అయిన వారికి 5 లక్షలు
కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్

ఆంధప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం ₹5 లక్షలు నష్టపరిహారం ప్రకటించడం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹ 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డినే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ₹25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ₹25 లక్షలు పరిహారం ప్రకటించండి. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదు, ముఖ్యమంత్రి గారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

బాధితులకు 5 లక్షల సాయం..
అదే విధంగా, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. ఆ హామీని కూడా నెరవేర్చండి. ప్రభుత్వం అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ప్రాణనష్టం జరిగింది. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించండి అని కేటీఆర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement