హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానా లపై అసెంబ్లి వేదికగా సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతా రామన్ డీడీ డైలాగ్ పేరుతో గురువారం నోటికొచ్చినట్లు చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు ఒకరికి మించి ఒకరు అబ ద్ధాన్ని మాట్లాడారని, పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు.
మోడీజీ కనీసం మీ మంత్రులందరికీ ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి.. అంటూ వ్యంగాస్త్రం సంధించారు. కేంద్ర మంత్రు లు పచ్చి అబద్ధాలు మాట్లాడడం దారుణమన్నారు. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు మంజూరై నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారని, మరో మంత్రి మన్సుఖ్ మాండవీయ మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదంటున్నారని, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మాత్రం కేవలం రెండు ప్రతిపా దనలే వచ్చాయని మాట్లాడుతున్నారని ఇలా ఒకరికొకరు పొంతన లేకుండా అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో కిషన్‌రెడ్డి ఒక ఆణిముత్యం, అపర మేధావి అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.