Friday, November 22, 2024

KTR – ప్రజల్లో పాజిటివ్ వైబ్రేషన్ – మూడోసారి సీఎంగా కేసిఆర్ తథ్యం.

సిరిసిల్ల విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్సిరిసిల్ల, నవంబర్ 28 (ప్రభన్యూస్) : వందల సభలు, రోడ్‌ షోలు, హాల్ మీటింగ్స్ లో కోట్లమందిని నేరుగా కలుసుకున్నామని, వాళ్ల మనసు తెలుసుకున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కే తారక రామారావు అన్నారు. మంగళవారం సాయంత్రం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌ నుంచి ఆలంపూర్ దాకా, బాసర నుంచి భద్రాచలం దాకా,ఒక వెల్లువలా ప్రజలు తరలి వచ్చారన్నారు.

ఎక్కడ చూసినా ఊపు..ఉత్సాహం..కేరింతలు చిరునవ్వులతో..ఆట పాటలతో నీరాజనం జనం పట్టారని తెలిపారు.ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపించిందని,,? గులాబీ ప్రభంజనం ఖాయమని, ముచ్చటగా మూడోసారి గెలుపు తథ్యమని, కేసీఆర్‌ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని పేర్కొన్నారు. కొత్త రికార్డులు నెలకొల్పడం..కొత్త చరిత్ర సృష్టించడంకేసీఆర్‌కు కొత్తకాదన్నారు. ప్రజల ఆశీర్వాదం..! అభిమానంతో సౌత్ ఇండియాలో వరుసగా మూడోసారి సీఎంగా అరుదైన ఘనత సాధించబోతున్నారని పేర్కొన్నారు. విశ్వాసంతో చెబుతున్న విజయం మనదే, ఈ రెండు రోజులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండనీ, సోషల్ మీడియాలో వచ్చే మాయా మశ్చీంద్రగాళ్ళ ఫేక్ న్యూస్‌లను, ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండని పిలుపునిచ్చారు. తెగించి పోరాడి..తెచ్చుకున్న తెలంగాణనుబాగుచేసునే బాధ్యతను ప్రజలు మాకు అప్పజెప్పారని, మెదళ్లను కరిగించి..రక్తాన్ని రంగరించి..ప్రాణం పెట్టి పనిచేసామాని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు.

దశాబ్దాల కష్టాలు..కన్నీళ్లు..బాధలు.. ..తెలంగాణ ప్రజలు కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయే రోజులు తీసుకురావాలని, కసిగా కృషి చేసామని, ప్రేమతో పరిపాలన సాగించామన్నారు. నీళ్లు..నిధులు.. నియామకాలు, ఉద్యమ నినాదాన్ని..ఒక విధానంగా మార్చి, ఆశలను..ఆకాంక్షలను నెరవేర్చుకున్నామన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ సోయితో విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని  ఇటుక ఇటుక  పేర్చి..పునర్ నిర్మాణం చేసుకున్నామని, కొత్త సంసారం..కొత్త రాష్ట్రం ఐనా.. తెలివితో ఇల్లు సగబెట్టుకున్నం. .సక్క దిద్దుకున్నం, సంపద పెంచి..సకల జనులకు పంచి, తక్కువ అప్పులు..ఎక్కువ ఆదాయం వుండే ఒక  సంక్షేమ రాజ్యాన్ని…సరికొత్త నమూనాని దేశం ముందు వుంచామని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement