(ఆంధ్రప్రభ స్మార్ట్, మేడ్చెల్ ప్రతినిధి ) మల్కాజ్‌గిరి లోక్‌సభ మనకు పోటీ కాంగ్రెస్‌తో కాదని. బీజేపీతోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగనివ్వొద్దని సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్‌రి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ.. “మేడ్చల్ అంటనే మాస్.. మల్లన్న.. మరి మాస్.. కేతక్క కూడా సూపర్. ఆమె మాట్లాడుతుంటే మరింత వినబుద్ది అవుతుంది. ఆమె మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటది. మల్లా రెడ్డి మేడ్చల్‌కే పరిమితం కాకుండా.. రాష్ట్రమంతా తిరగాలి. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయన గొంతు అవసరం” అని కేటీఆర్ పేర్కొన్నారు.
కమిట్ ఉన్న లీడర్ మల్లాడరెడ్డి
మల్లారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి ఎన్నో రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు కెటిఆర్ . ఆయన నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నింటికి అన్ని గెలిచారని ప్రశంసించారు.. అయితే గెలిచింది మల్లారెడ్డి అంటున్నారు కానీ గెలిపించింది మీరు అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు… మీరు కష్టపడితేనే 10కి 10 గెలిచామని,. ఎంతో కమిట్ మెంట్ ఉంటేనే ఇది సాధ్యమైందన్నారు. . మేడ్చల్‌లో బీఆర్ఎస్ బలమేందో తెలిసిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌తో పోటీ లేదు..
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సామాజిక సేవలు చేస్తూ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లోని ప్రజలతో కలిసి మెలిసి ఉన్నారన్నారు.. బ్రహ్మాండంగా ఆయనకు సేవాగుణం ఉందని, అందుకే వారిని కేసీఆర్ పిలిచి ఆశీర్వదించి అభ్యర్థిగా ప్రకటించారన్నారు. . మనకు కాంగ్రెస్‌తో పోటీ లేదని, . కేవలం డమ్మీ అభ్యర్థిని మన ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తిని నిలబెట్టారన్నారు. . చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ బలవంతంగా నిలబెట్టారన్నారు.