ప్రభన్యూస్ ప్రతినిధి, జనగామ : వరంగల్ జిల్లా గులాబీ మయం అయ్యింది. ఎక్కడ చూసినా మంత్రి కేటీఆర్ ఫొటోలు, ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ జెండాలు దర్శనమిస్తున్నాయి. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ 20వ తేదీన (బుధవారం ) వరంగల్ జిల్లాలో పర్యాటన చేయనున్నట్లు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్తూ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సాయంత్రం 5గంటల నుంచి 7గంటల మధ్యలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్పూర్కు రానున్న కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement