రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీ బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్‌కు భూమిపూజ చేశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 1993 నుంచి 1996 వరకు నిజాం కాలేజీలో చదువుకున్నాని చెప్పారు. ఈ కాలేజీలో చదువుకోవడం గర్వంగా ఉందన్నారు. విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఉస్మానియా టీవీ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యా శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కల్పిస్తామని తెలిపారు. యూనివర్సిటీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని చెప్పారు. గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణిదేవి, ఎల్.రమణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.