కాంగ్రెస్ పార్టీ పై ట్వీట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవాక్కులు పేల్చాడు. దేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
- Advertisement -
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినదన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విధానాలుంటాయన్నారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే… తెలంగాణలో కారు గుర్తు పై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందన్నారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశం పైన మాట్లాడాలన్నారు.