హైదరాబాద్: తొమ్మిదేళ్ళ కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమానలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ మంత్రి కెటిఆర్ ప్రధాని మోడికి ట్విట్టర్ ద్వారా వివరించారు.. ఇన్ని పథకాలు అమలు చేస్తున్న ఒక్క రాష్ట్రానైనా చూపండి అంటూ ఆయన సవాల్ విసిరారు.. కేవలం కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోడీ హైదరాబాద్ ఈవచ్చారని మంత్రి మర్శించారు. దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ పాలసీ కలిగిన రాష్ట్రం తెలంగాణ అని, దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్నదని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రమని, దేశంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని నోటినుంచి ఒక్క అభినందన కూడా రాలేదంటూ పీఎం మోడీని కెటిఆర్ ఎత్తిపొడిచారు..
‘దేశంలోని అత్యధిక తలసరి వృద్ధి కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికీ తాగునీరు అందించిన రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తిచేయడంతోపాటు దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించాం. దేశంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. ఐటీ రంగంలో ఉద్యోగ కల్పనలో దేశంలోనే ముందంజలో ఉన్నాం. తెలంగాణలో గ్రీన్ కవర్ వృద్ధి 7.7 శాతంగా ఉన్నది. దేశంలో అత్యధిక అవార్డులు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. భారతదేశ డీజీపీ వృద్ధిలో సహకారం అందిస్తున్న 4వ ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ.
దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు, ప్రపంచ వ్యాక్సిన్ హబ్‌లు తెలంగాణ ప్రత్యేకతలు. తాజాగా విడుదలైన సీఎస్‌డీఎస్ నివేదిక ప్రకారం దేశంలో అతితక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క అభినందనా రాలేదు. రాజకీయాల కోసం అత్యుత్తమ పర్ఫార్మింగ్ రాష్ట్రంగా తెలంగాణను ప్రధాని అంగీకరించలేకపోతున్నారు.’ అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ విమర్శించారు.