Monday, November 18, 2024

కర్నాటకకు ఉచిత సిలిండర్లు ఇస్తున్న‌ప్పుడు మాకెందుకివ్వ‌రు – మోడీని నిల‌దీసిన కెటిఆర్

సిరిసిల్లా – ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ తన కర్నాటక ఎన్నికల ప్రచారంలో చెబుతోందని, మరి తెలంగాణ మాటేమిటని మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. ఉచితాలు సరైనవి కావ‌ని ఇన్నాళ్లు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ గొంతు చించుకున్నారని, ఇప్పుడు అదే పార్టీ మూడు సిలిండర్లు ఉచితం, పాలు ఉచితం అని కర్నాటకలో తమ మేనిఫెస్టోలో ఎందుకు ప్ర‌క‌టించార‌ని నిల‌దీశారు.. సిరిసిల్ల ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ వాసిగా తాను ప్రధాని మోడీని ఒక ప్రశ్న అడుగుతున్నాన‌ని, మీరు దేశానికి ప్రధానా లేక కర్నాటకకు ప్రధానా అంటూ ప్ర‌శ్నించారు.. దేశానికి ప్ర‌ధాని అయితే కర్నాటకకు ఇచ్చినప్పుడు తెలంగాణకు మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వరన్నారు. అలాగే మిగతా 28 రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వరని అడిగారు. గ‌త ప్ర‌భుత్వ హాయాంలో రూ.400 ఉన్న సిలిండర్ మోడీ పాల‌న‌లో అది రూ.1200కు పెరిగిందని ఫైర్ అయ్యారు..పాలు, ఉప్పు,నీళ్లు, బియ్యం, బిస్కెట్లు, చేనేత వ‌స్త్రాల‌పై ప‌న్ను వేసిన ఘ‌న‌త మోడికే ద‌క్కుతుంద‌న్నారు కెటిఆర్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement