టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత మహిళా హాకీ జట్టును మంత్రి కేటీఆర్ అభినందించారు. ఒలిపింక్స్‌లో మెడల్ కోసం ఎంతో శ్రమించి, కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళలు రాణించగలరన్న నమ్మకాన్ని ప్రదర్శించి.. ఎంతో మంది బాలికలకు ప్రేరణగా నిలిచారని కేటీఆర్ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా, టోక్యో ఒలింపిక్స్ హాకీ కాంస్య పతక మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో బ్రిటన్ 4-3 గోల్స్ తేడాతో పతకాన్ని సొంతం చేసుకున్నది. తుద వరకు ఇండియన్ వుమెన్ పోరాడినా..ఫలితం దక్కలేదు. మ్యాచ్ గెలిస్తే ఇది భారత మహిళా హాకీ జట్టుకు చరిత్రాత్మక విజయం అయ్యేది. భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్‌లో ఆడడం 1980 నుంచీ ప్రారంభమైంది. గురువారం భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని 5-4తో ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. 1980 తర్వాత ఒలింపిక్స్ హాకీలో భారత్‌కు ఇది మొదటి పతకం.
ఇది కూడా చదవండి: Tokyo Olympics:కాంస్య పతక పోరులో భారత అమ్మాయిలు ఓటమి..