నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్) 25: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ లు,జైన్లు అందరూ సంతోషంగా ఉన్నార నీ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ అన్నారు. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి తానే సాక్షమన్నారు బిజె పి, మోడీ ని ఢీకొట్టే దమ్ము కేవలం బిఆర్ఎస్ కే ఉందన్నా రు. శనివారం నిజామాబాద్ నగరంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య ర్థి గణేష్ బిగాల ఖిల్లా రోడ్ లో నిర్వహించిన రోడ్ షో కార్యాక్ర మానికి బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు ధీటుగా నిజామాబాద్‌లో ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేశారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండిం గ్లో ఉన్న అండర్ గ్రౌండ్ పను లు పూర్తి చేశాం. ప్రజలు కష్టా ల్లో ఉన్న కరోనా సమయంలో సొంత డబ్బుతో గణేష్ గుప్తా సేవలు అందించారు. తెలంగా ణలో 10 ఏండ్లలో ఒక్క మత ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మత పరంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తోంది. కామా రెడ్డిలో పని చేయలేని షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో ఏం పని చేస్తాడని విమర్శించారు. నిజామాబాద్ లో ఐటి హాబ్ ఎవరు కట్టారు? సమీ కృత కలెక్టర్ కార్యాలయం ఎవరు కట్టారు?..మన యువ తకు స్కిల్స్ నేర్పించేందుకు న్యాక్ భవనం ఎవరు కట్టా రనే ది… అర్బన్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తో గణేష్ బిగాలా నిధులు మం జూరు చేసుకుని నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారనీ తెలిపారు.కరోనా వచ్చినపుడు మీకు అండగా ఉండి మీకు అన్నం పెట్టింది.. గణేష్ బిగాల అని గుర్తు చేశారు. మీకు కళ్యాణ లక్ష్మీ , షాది ముభారక్ చెక్కు మీకు కొత్త బట్టలు పెట్టిం ది గణేష్ బిగాల..అని అన్నారు గణేష్ బిగాల కి నిజామాబాద్ లో ప్రతి గల్లీ,ప్రతి వీధి తెలు సునని అన్నారు.గణేష్ బిగాల గెలిస్తే మీకు ఎపుడు అందు బాటులో ఉంటాడన్నారు.షబ్బీర్ అలీ గెలిస్తే మీకు పని పడితే ఎక్కడికి పోతారు. ఒక్క సారి మీరు ఆలోచించండి అని అన్నారు. స్వాతంత్రం వచ్చి నప్పటి నుండి 2014 వరకు నిజామాబాద్ నగరం ఎలా ఉంది… ప్రస్తుతం ఏ విధంగా నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి చెందిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి జరగని అభివృద్ధి ని 9 సంవత్సరాల లో గణేష్ బిగాల చేసిన అభివృద్ధి మీ ముందే ఉందన్నారు. తెలంగాణ లో ఎక్కడ లేని విధంగా అధ్బు తంగా ట్యాక్ బండ్ గణేష్ బిగాల నిర్మించారన్నారు.కరోన సమయం లో మీకు రెండు సార్లు సొంత ఖర్చు లతో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి, కరోనా రోగులకు ప్రతి రోజు వేయిల మందికి అన్నం పెట్టాడనీ గుర్తు చేశారు.
కామారెడ్డి లో చేల్లని రూపాయి నిజామాబాద్ లో ఎలా చెల్లుతుంది?
మరి ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ గల్లిలా ఎపుడైనా కనిపిం చాడా అని ప్రశ్నించారు. కామా రెడ్డి, ఎల్లారెడ్డి లో 9 సార్లు పోటీ చేస్తే 7సార్లు ఓడిపోయాడు.కామారెడ్డి లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ 9 ఏండ్ల లో మైనారిటీ ల సంక్షేమానికి 12,780 కోట్లు ఖర్చు చేస్తే 2004 నుండి 2014 వరకు కాంగ్రేస్ పార్టీ రూ930 కోట్లు మాత్రమే ఖర్చు చేశారనీ తెలి పారు.రాహుల్ గాంధీ వచ్చి మైనారిటీ లు పేద వాళ్ళు అంటాడు.. మరి 55 సంవ త్స రాలు అధికారం లో ఉన్న పుడు ఎం చేశారో చెప్పాలని ప్రశ్నించా రు.11 సార్లు కాంగ్రెస్ కి అధి కారం ఇస్తే 11 సార్లు మైనారిటీ లకు డొకా చేశారనీ మండిప డ్డారు. కాంగ్రెస్ నాయ కులు బి.ఆర్.ఎస్ పార్టీ బిజెపి రెండు ఒకటే అంటారు.కానీ ఇప్పటి వరకు కేసీఆర్ బిజెపి తో పొత్తు పెట్టుకోలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీని ,కేసీఆర్ ని గొంతు నొక్కాలని మోడీ-షా చూస్తు న్నారనీ తెలిపారు.మైనార్టీ సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.రూ12 వేల కోట్ల రూపాయల నిధులు మైనారిటీ సంక్షేమం కోసం ఖర్చు చేశా మన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ వంటి మైనార్టీ గురుకులాలు ఉన్నా యా? అని ప్రశ్నించారు. ముస్లిం లు అత్యధికం గా ఉన్న యూ పీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఇవ్వనన్ని నిధులు సీఎం కేసీఆర్ తెలంగాణలో ఇచ్చార ని గుర్తు చేశారు. ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల నిధులు కేటాయి స్తామన్నారు. సీఎం పీఠం కోసం మత ఘర్షణలు చేసే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇద్దామా ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే అది బిజెపి లాభం జరుగు తుందన్నారు.9 సంవత్సరాల లో గణేష్ బిగాల చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంది.అభివృద్ధి ని చూసి..గణేష్ బిగాలని గెలిపిస్తే నిజామాబాద్ నగరాన్ని మరింత ముందుకు తీసుక వెళ్తారనీ కోరారు.మేము గెలిచిన వెంటనే 400 రూ.లకే సిలిండర్ ఇస్తాము.18 సంవ త్సరాలు నిండిన మహిళలకు సౌభాగ్య లక్ష్మీ ద్వారా 3000 రూ.ల.భృతి ఇస్తాము.రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి సన్న బియ్యం ఇస్తాము. ప్రతి కుటుం బానికి 5 లక్షల రూ.ల.కేసీఆర్ భీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. మన సార్ కేసీఆర్… మన గుర్తు కారు గుర్తు.మరోసారి మీరు కారు గుర్తుకి ఓటు వేసి బి.ఆర్.ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు
. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదు ..
బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదు, భవిష్యత్‌లో కూడా జత కట్టదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు భయపడేది లేదన్నారు. పొరపా టున కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి ఓటు వేస్తే ఆయన మళ్లీ ఎక్కడ కూడా కనపడడు. 1990 ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ జరిగిం ది.400 మరణించారనీ వాపోయారు..60 ఏళ్లు పాలిం చింది మీరే కదా?..ఇప్పుడు వచ్చి ఒక్కసారి అవకాశం కల్పించండి అడగడం ఏమిటని ప్రశ్నించారు.ప్రతిసారి మోసం చేస్తూనే ఉన్నారనీ మండి పడ్డా రు.మైనార్టీలు ఇలా ఉండ డానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని పేర్కొన్నారు.కెసిఆర్ ది 45 సంవత్సరాల రికార్డ్ అని తెలిపారు.మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి.. భయపెట్టడానికి ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారన్నారు.సెక్యులర్ లాగే ఉంటామన్నారు. గోషమా లలో డమ్మీ క్యాండిడేట్ ను నిలబెట్టారు..కాంగ్రెస్ చాలా చోట్ల డమ్మీ క్యాండిట్ల నిల బెట్టింది.. దీన్ని ఏం అర్థం చేసుకోవచ్చన్నారు. షబ్బిర్ అలీ ను గెలిపిస్తే… ఏదైనా పని కోసం ఎక్కడికి వెళ్తారనీ అన్నా రు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టా లేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బిజెపికే లాభం కలు గుతుందన్నారు.రాజకీయాలల్లో ఉన్నన్ని రోజులు సెక్యు లర్ గానే ఉంటామన్నారు. నిజా మాబాద్ అర్బన్ ప్రజలు మరో సారి గణేష్ బిగా లకు అవకా శం ఇచ్చి గెలిపిస్తే నిజామాబాద్ అర్బన్ ని మరింత అభివృద్ధి చేస్తారని కోరారు. .
ఈ కార్యక్రమంలో ఎంపీ KR సురేష్ రెడ్డి, నగర మేయర్ , దండు నీతు కిరణ్,రెడ్కో మాజీ చైర్మన్ SA అలీం,మీర్ మాజాజ్ అలీ,నవీద్ ఇక్బల్,అబ్దుల్ కుద్దుస్,కరీముద్దీన్ కమల్,బాబ్ల్యూ ఖాన్,బబ్బు తదితరులు పాల్గొన్నారు.