హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి బడ్జెట్లోనూ రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కెెంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌కు సోమ వారం ఒక లేఖ రాశారు. తెలం గాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతి బడ్జెట్లో జరిగిన తీవ్రమైన అన్యా యాన్ని లేఖలో కేటీ-ఆర్ ప్రస్తావించారు. కనీసం ఈసారైనా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తగినన్ని నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన పలు రైల్వే ప్రాజెక్టులతో పాటు- ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైనన్ని నిధులు ఇవ్వాలని అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని లేఖలో కేటీ-ఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు- చేయాలని పునర్విభజన చట్టంలో నిర్దేశించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీ-ఆర్ గుర్తు చేశారు.
దీంతో పాటు- తెలంగాణలో మరిన్ని రైల్వే లైన్లను ఏర్పాటు-చేసి రైల్ కనెక్టివిటీ-ని పెంచాలన్న తమ ప్రభుత్వ డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని కేటీ-ఆర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయక త్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోం దని, ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు- ఐటీ- ఎగుమతుల వరకు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా తెలంగాణ వృద్ధి కొన సాగుతోందన్నారు. ఈ ప్రగతిని మరింత బలోపేతం చేస్తూ రైతులు, ప్రజల ప్రయోజనార్థం లాజిస్టిక్స్ రంగంలో అనేక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు.