Tuesday, November 26, 2024

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు నిధులివ్వండి – కేంద్రమంత్రికి కెటిఆర్ లేఖ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి బడ్జెట్‌లోనూ రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కెెంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్‌ రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు సోమ వారం ఒక లేఖ రాశారు. తెలం గాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతి బడ్జెట్‌లో జరిగిన తీవ్రమైన అన్యా యాన్ని లేఖలో కేటీ-ఆర్‌ ప్రస్తావించారు. కనీసం ఈసారైనా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తగినన్ని నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన పలు రైల్వే ప్రాజెక్టులతో పాటు- ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైనన్ని నిధులు ఇవ్వాలని అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని లేఖలో కేటీ-ఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు- చేయాలని పునర్విభజన చట్టంలో నిర్దేశించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీ-ఆర్‌ గుర్తు చేశారు.
దీంతో పాటు- తెలంగాణలో మరిన్ని రైల్వే లైన్లను ఏర్పాటు-చేసి రైల్‌ కనెక్టివిటీ-ని పెంచాలన్న తమ ప్రభుత్వ డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని కేటీ-ఆర్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ నాయక త్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోం దని, ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు- ఐటీ- ఎగుమతుల వరకు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా తెలంగాణ వృద్ధి కొన సాగుతోందన్నారు. ఈ ప్రగతిని మరింత బలోపేతం చేస్తూ రైతులు, ప్రజల ప్రయోజనార్థం లాజిస్టిక్స్‌ రంగంలో అనేక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement