Saturday, September 14, 2024

KTR – కంపెనీలు వెళ్లిపోతామని అంటున్నాయి … మేల్కొండి రేవంత్ జీ

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర రాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు చూస్తున్నమని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు

ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్‌ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయని చెప్పారు. కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయిందని, కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని తెలిపారు. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతున్ననదని.. తెలంగాణ బ్రాండ్‌కు ఇది తీవ్ర నష్టం చేస్తుందని హెచ్చరించారు.

రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టటం ఎంతమాత్రం మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలన్నారు. అమరరాజా సంస్థ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా వాళ్లను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.

- Advertisement -

నిజానికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్‌గా ఉంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, దివాళా తీసిందంటూ ఎయిడ్స్, క్యాన్సర్ పేషెంట్ అని ప్రచారం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసే ఇలాంటి ప్రకటనలు సీఎం గారు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలన్నారు. లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement