Friday, November 22, 2024

Breaking: కేటీపీపీ 1100 మెగావాట్లలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1,2వ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ తో బుధవారం 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇలా ఒకేసారి రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి.

ఒక్కరోజు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే సంస్థకు రూ.4 కోట్ల నష్టం వాటిల్లనుంది. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలంటే రెండు, మూడు రోజులు పడుతుందని కే.టి.పీ.పీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement