ములుగు జిల్లాలో కమలాపురం, మంగపేట గ్రామాల్లో క్షుద్రపూజల ఘటనలు కలకలం రేపాయి. కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ రెండవ గేటు సమీపంలో ఏటూరునాగారం-బూర్గంపాడ్ ప్రధాన రహదారిపై 15 రోజులక్రితం గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. ఘటనాస్ఠలంలో నల్లకోడి, పసుపు, కుంకుమ, జీడిగింజలు, ఇనుపమేకులు, నిమ్మకాయలు, కుంకుమ కలిపిన ఎర్ర అన్నంతో క్షుద్రపూజలు నిర్వహించారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మంగపేట, కమలాపురం ప్రధాన రహదారిపై దొంగలఒర్రె సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించారు. క్షుద్రపూజల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని సమీప గ్రామాలప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement