Tuesday, November 26, 2024

Krishna Arjunas in Election Kurukshetra … తార‌క మంత్రం… హ‌రీష్ తంత్రం …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వారిద్దరూ భారాసకు పెట్టని కోటలు… వ్యూహాల్లో ఆరి తేరిన యోధులు.. ఎత్తుగడల్లో ప్రత్య ర్ధులు చిత్తే… ట్రబుల్‌ షూటింగ్‌లో ఒకరికి మించిన వారొకరు! వారే భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, మరో మంత్రి హరీష్‌రావులు. ఇప్పుడు జరుగనున్న అసెంబ్లి ఎన్ని కల్లో పార్టీ హ్యాట్రిక్‌ కొట్టడా నికి ప్రధాన బాధ్యత వారిపైనే పడింది. అధినేత ఆంక్షలకు అనుగుణంగా, ఆయన మనసెరిగి నడిచే వారిద్దరూ రోజుకి 18 గంటల పరిశ్రమిస్తున్నారు. కాళ్లకు బల పాలు కట్టుకుని రాష్ట్రమంతా అవిశ్రాంతంగా పర్యటిస్తు న్నారు. రోజుకు రెండు మూడు సమావేశాలు జరుపుతున్నా రు. శ్రేణులను ఉత్తేజ పరుస్తూ ముందుకు సాగుతున్నారు. అధినేత చేతిలో బ్రహ్మాస్త్రాలై ప్రత్యర్ధి పార్టీలకు గుబులుగా మారారు! సాధారణ నాయకుల్లా భేషజాలుగా పోకుండా కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలుకరిస్తూ ముందుకు సాగుతున్న తీరు వారి నాయ కత్వ పటిమకు అద్దం పడుతోంది. ఊరూరా కార్యకర్తలను గుర్తుపట్టి భుజం తట్టడం నిజంగా ఏపార్టీకైనా వరం. సాధకబాధకాలను ఆరా తీస్తూ ఎక్కడ ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా వాలి పోయి సరిదిద్దడం వల్లే అగ్రస్థాయి నేతలుగా ఎదిగారు.

ఆధినేత సూచనలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంపైనా వారి ఫోకస్‌ ఉంటుందనడంలో అతిశ యోక్తి లేదు. పార్టీలో ఎటువంటి అసం తృప్తిని ఎవరు వ్యక్తం చేసినా వారితో ముఖాముఖి చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇక తమ ప్రసంగాలతో ప్రజానీకాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు… చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటారు. కుల సంఘాల నుంచి, స్వచ్ఛంద సంస్థలపై కూడా వారి దృష్టి ఉంటుంది. అన్ని వర్గాల వారిని వారి అవసరాలను గుర్తించి తగు రీతిలో స్పందించడం ద్వారా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. ప్రతి కింది స్థాయి నేత కదలికలను గుర్తించి అవసరమైతే సవరించి ముందుకు నడిపించడంలో నేర్పరులు.

ఎన్నికల వేళ పోల్‌ మేనేజ్‌మెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. బూత్‌ల వారీగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు రచించడం, అమలు చేయడంపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. కిందిస్థాయి నేతలపై ప్రత్యేకంగా వారి దృష్టి ఉంటుంది. బూత్‌ స్థాయిలో వాస్తవంగా ఓటర్లను ప్రభావితం చేయడం, దగ్గరుండి బూత్‌కు నడిపించడం, ఓట్లు వేయించడంలో కార్యకర్తల, కిందిస్థాయి నేతల శ్రమను గుర్తించిన నాయకులుగా వీరిపై ప్రత్యేక అభిమానాన్ని శ్రేణులు చాటుతున్నాయి. ఆర్భాటంగా వ్యవహరించే నేతలు ఎవరో, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరో వారికి తెలుసు… అదే సమాచారాన్ని అధినేతకు వారు ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. ఇంటిలిజెన్స్‌ కంటే వేగంగా పార్టీలో, సమాజంలో, ప్రత్యర్ధి పార్టీల్లో ఏం జరుగుతోందో వీరికి క్షణాల్లో తెలిసిపోతుంది. అంత ప్రామాణికంగా, విశ్వసనీయంగా పనిచేసే వ్యవస్థను వారు రూపుదిద్దుకున్నారు. అవసరమైతే ప్రత్యర్ధి పార్టీల్లో సమర్ధులుగా గుర్తింపు పొందిన వారిని కూడా వారు సరైన గుర్తింపునివ్వడం ద్వారా, గౌరవించడం ద్వారా తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించగలగడం వారి సమర్ధతకు గీటురాయి.
ఎన్నో యుద్ధాలలో ఆరతేరిన యోధుల్లా వీరు వ్యవహరిస్తున్న తీరును బట్టే అధినేత వ్యూహాలు, ప్రణాళికలు తు.చ. తప్పకుండా అమలు కావడమే కాకుండా ఫలిస్తున్నాయి. ప్రతి పార్టీ ఎంతో ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా… పోలింగ్‌ సమయంలో మేనేజ్‌మెంట్‌ సరిగ్గా లేక బోల్తా పడుతుంటాయి. కీలకమైన ఈ అంశంలో కేసీఆర్‌ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడంలో కేటీఆర్‌, హరీష్‌లను మించిన చాణక్యులు లేరని రాజకీయ నిపుణుల అభిప్రాయం!

Advertisement

తాజా వార్తలు

Advertisement