Wednesday, January 15, 2025

Bail – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిలు మంజూరు

కరీంనగర్ క్రైమ్ ఆంధ్రప్రభ హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి తీర్పునివ్వడంతో హై టెన్షన్కు తేరపడింది. మంగళవారం కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు సంక్రాంతి సెలవు దినం కావడంతో న్యాయమూర్తి ఇంటి వద్ద కౌశిక్ రెడ్డిని హాజరు పరిచారు. బారసా లీగల్ టీం వాదనాలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.

నిన్న రాత్రి హైదరాబాదులో కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ కు తరలించి ఈరోజు ఉదయం వరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. వైద్య పరీక్షలను సైతం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను పిలిపించి పోలీస్ స్టేషన్లోనే చేయించారు. కౌశిక్ రెడ్డి ని రెండు కేసుల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు.

కరీంనగర్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ తనను సమావేశంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు తో పాటు, జగిత్యాల ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు కరీంనగర్ ఆర్డిఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు ఒకే దాంట్లో క్లబ్ చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని తమ వైపే న్యాయం ఉందని బిఆర్ఎస్ నేతలు తెలియజేసారు.

.*ఎన్ని కేసులు పెట్టిన బెదిరేది లేదు* .

..హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదని, ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నిస్తూనే ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడానికి తీసుకెళ్లే సమయంలో మాట్లాడుతూ ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసిన తాను భయపడేది లేదన్నారు.

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అడిగితే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజల పక్షాన ఉండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. హామీలను అమలు చేయడం మర్చిపోయి ప్రభుత్వం బారాసా నేతలను అక్రమంగా అరెస్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement