జైనూర్, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : స్వాతంత్ర్య 70వ భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కోటి వృక్ష కార్యక్రమం నిర్వహించాలనే ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో శనివారం ఘనంగా కన్నుల పండుగగా కోటీ వృక్షోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సామూహికంగా మొక్కలు నాటారు. అనంతరం జాతీయ గీతాల ఆలాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ యాదవ్, సహకార చైర్మన్ కొడప హాను పటేల్, కోఆప్షన్ సభ్యులు ఆఫరోజ్ ఖాన్, స్థానిక సర్పంచ్ మెస్రం పార్వతి లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ కోడప విశ్వంభర్ రావు, ఎంపీడీవో ప్రభుదయ, మండల విద్యాశాఖ అధికారి కుడుమేత సుధాకర్, సీఐ మల్లేష్, ఎస్సై సందీప్ కుమార్, ఈజీఎస్ ఏపీవో నగేష్, టెక్నికల్ అసిస్టెంట్ గులాబ్ సింగ్, ఐకెపి ఎపిఎం సుజాత, జైనూర్ ఈఓ శ్రీనివాసరెడ్డి, ఐ సి డి ఎస్ సి డి పి ఓ ఇందిరా, సిఐటియు నాయకురాలు రాజమణి, బీఆర్ఎస్ నాయకులు మెస్రం అంబాజీ రావు, అజ్జు లాల, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.