ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో 8.90 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 50 పడకల మాతా శిశు ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మీరు పేదల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. తల్లీ బిడ్డల సంక్షేమం కోసమే ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు తెలిపారు. మాతా శిశు ఆసుపత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయనీ, ధర్మపురి తో పాటుగా చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement