కొండమల్లేపల్లి ఫిబ్రవరి 8 ప్రభా న్యూస్ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న పల్ల శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం 30వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సంఘటనకు సంబంధించి ఏసీబీ నల్గొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, కొండమల్లేపల్లి మండలం కేశ్యతండ గ్రామానికి చెందిన బాణావత్ బిచ్చు అనే రైతు గత రెండు నెలలుగా తన పెద్దమ్మ బాణావత్ మంగమ్మ హనుమ చనిపోవడంతో , భూమిని పట్టా చేయాల్సిందిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించాడు .దీంతో శ్రీనివాసరెడ్డి 30 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడని తెలిపారు.
. ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి 30 వేల రూపాయల లంచం అడగడంతో రైతు ఏసీబి ని ఆశ్రయించాడు. గత వారం రోజులుగా శ్రీనివాసరెడ్డి గత నాలుగు రోజుల నుండి తాసిల్దార్ కార్యాలయానికి రావడం లేదని పేర్కొన్నారు. గురువారం దేవరకొండ లోని డిండి ఎక్స్ రోడ్ వద్ద ,మీనాక్షి సెంటర్లో సదరు రైతు నుండి ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అతని కారులోనే పట్టుకున్నామని డిఎస్పి శ్రీనివాసరావు పేర్కొన్నారు
.అక్కడ నుండి తాసిల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. తదుపరి చర్యలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే మమ్మల్ని సంప్రదించాలని కచ్చితంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 9154388918, 9154388920, 9154388921, నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు .పట్టుబడిన నిందితుడు ఆర్ ఐ పల్ల శ్రీనివాస్ రెడ్డి పై గతంలోనే పలు ఆరోపణలు ఉన్నాయి. బర్త్ సర్టిఫికెట్ ,కళ్యాణ లక్ష్మి, మొదలుకొని కోట్ల విలువ చేసే భూముల వరకు లంచం లేనిదే సంతకాలు చేయడనే ఆరోపణలు గప్పుమంటున్నాయి .