Saturday, June 29, 2024

Konda Warns – ఇసుక మాఫియాని అడ్డుకుంటాం – దాడులు చేసిన వారిపై చ‌ర్య‌లుంటాయి


రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫియా అగ‌డాల‌ను ఆడ్డుకుంటామ‌ని , వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి కొండ సురేఖ హెచ్చ‌రించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై ట్రాక్టర్ తో ఎక్కించి చంపడానికి చేసిన కుట్రలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారెవరైనా ఉపెక్షించమన్నారు .కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతంలో గతంలో జరిగిన దాడుల దృష్ట్యా అధికారులు ఎల్లపుడూ అప్రమత్తంగా ఉంటు, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement