Tuesday, November 19, 2024

TS: కోమ‌టిరెడ్డి ప‌రాన్న‌జీవి… త‌న‌ను విమ‌ర్శించే అర్హ‌త లేదు… జ‌గ‌దీష్ రెడ్డి

కోమటిరెడ్డి ఓ పరాన్నజీవి అని, తన గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ…. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను ఓడించానని ఎప్పుడైనా చెప్పానా ? అలాంటి పోజులు కొట్టే అలవాటు తనకు లేదని జగదీశ్ రెడ్డి అన్నారు. మోడీ రేవంత్ ఇద్దరూ ఒకటే అన్నారు. పదేళ్లలో కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశారని తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను బద్నాం చేయాలని, పార్టీని బలహీనం చేయాలని లేని కేసులతో బెదిరించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఫోన్ టాపింగ్, కాళేశ్వరంపై కావాలని కథనాలు రాయిస్తున్నారని సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కరువు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా, హామీలు, కరువు, రైతు సమస్యలు, మంచినీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు బయటకు రావద్దని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని.. 16 సీట్లలో టిఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. కృష్ణ, గోదావరి జలాల్లో వాటా దక్కాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు.

ఈసారి బీఆరెస్ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి భయపడే నేతలను, కార్యకర్తలను పెండింగ్ బిల్లులు, కేసుల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. బిజెపిపై కొట్లాడేది కేసీఆర్, కేజ్రీవాల్, సోరెన్లు మాత్రమే అన్నారు. తెలంగాణకు చారిత్రక అవసరం బీఆర్‌ఎస్ అన్నారు. తెలంగాణను మోడీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోను ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. 16 సీట్లు గెలుస్తామని.. కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్తున్నారన్నారు. చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్‌లలో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నేతలను చేర్చుకొని టికెట్లు ఇచ్చారన్నారు.

- Advertisement -

విద్యుత్ 24 గంటల సరఫరా పై లాగ్ బుక్కులను బయట పెడితే తెలుస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో గెలుపు ఓటములపై తన వంతు పాత్ర ఉంటుందన్నారు. రిజర్వేషన్లు కొనసాగించాలనేదే బిఆర్ ఎస్ నినాదం అన్నారు. బీజేపీ రిజర్వేషన్ల పేరుతో ఒక వర్గాన్ని అణచి వేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై ఈసీ కేసు పెట్టవచ్చన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించవచ్చన్నారు. దేశంలో చట్ట వ్యతిరేక పాలన కొనసాగుతుందని.. శ్రీశైలం నీరు తెలంగాణకు రావద్దని ఎస్‌ఎల్‌బీసీపై నాడు వైఎస్ఆర్ కుట్ర చేశారని గుర్తు చేశారు.

మోడీవి పేలవమైన మాటలు.. రేవంత్ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి తీసుకెళ్తుంటే ఎందుకు ఆపడం లేదన్నారు. మోడీకి రాహుల్‌కు మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్ చెత్త వివాదం అని కొట్టిపారేశారు. తనపై రెవెన్యూ యాక్ట్ పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు.. తనకు అక్రమ ఆస్తులు ఉంటే విచారణ చేసుకోండని సవాల్ విసిరారు. ఏ విచారణకైనా తాను సిద్ధం అని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ హక్కులు సాధ్యమవుతాయన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్‌ఎంబిపై వెనక్కి రాష్ట్ర ప్రభుత్వం తగ్గిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement