కృష్ణాజలాల అప్పగింతపై జగన్ స్వయంగా వారి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండలో సభ పెట్టాలంటే ముందు దీనిపై గులాబీ లీడర్లు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లు జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో ఒక్క చోటే ఆ పార్టీ గెలిచిందని,. ప్రజల విశ్వాసాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి కలిసి నల్లగొండ జిల్లాకు మోసం చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ నుంచి నీళ్ళు తాగేవాళ్ళమని, ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవాల్సి వస్తున్నదన్నారు. ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే నల్లగొండ సభకు రావాలని డిమాండ్ చేశారు.