త్వరలో కోమరవేల్లి కొత్త స్టేషన్ కు శ్రీకారం చుడుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం కు వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.9 ఏళ్ల పాలనలో దేశంలో వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు.గడిచిన పదేళ్ల పాటు రైల్వే వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు వెళ్లాయన్నారు. జాతీయ బడ్జెట్ లో కేంద్రం రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు 20 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. 85 వేల కోట్ల రైల్వే అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 90 శాతం పూర్తి అయిందని, త్వరలోనే టెర్మినల్ ను అందుబాటులోకి వస్తుందన్నారు.
తెలంగాణ లో ఖాజీపేట్ రైల్ కోచ్ ప్రారంభం….చర్లపల్లి లో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రూ 750 కోట్ల పనులతో పున: నిర్మాణ పనులు జరుగుతుందని తెలిపారు. అదే విధానంగా నాంపల్లి లో త్వరలో రూ 350 కోట్ల నిధులతో కొత్త రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రూ 85 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని అన్నారు.