Tuesday, November 26, 2024

తెలంగాణ సాయుధ పోరాటంలో మొద‌టి వ్య‌క్తి కొమ‌ర‌య్య : మంత్రి ఎర్ర‌బెల్లి

తెలంగాణ ఉద్యమానికి ముందు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులైనార‌న్నారు. వారిలో దొడ్డి కొమరయ్య మొదటివాడని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ, దొడ్డి కొమరయ్య పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గడీలో షూటింగ్ ప్రారంభ‌మైంది. వీఆర్ ఇంటర్నేషనల్.ఐఎన్సీ పతాకం పై మురళి దర్శకత్వంలో వీరారెడ్డి… ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నిర్మాణ సారథ్యంలో నిర్మితమవుతున్న సినిమా దొడ్డి కొమరయ్య.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కడవెండిలో సంఘం మీటింగ్ జరుగుతుండగా, రజాకార్లు జరిపిన కాల్పుల్లో కొమరయ్య అమరుడయ్యార‌న్నారు. ఆయన పోరాట తత్వం, అలాంటి ఎందరో త్యాగాల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. సాధించిన తెలంగాణ ను బంగారు తెలంగాణ చేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. మనకు, మన ముందు తరాల వారికి ఆనాటి పోరాట యోధుల జీవిత చరిత్రలు తెలియాల్సి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన చరిత్ర, మన సంస్కృతి, మన వైతాళికులు నిర్లక్ష్యానికి గురయ్యార‌న్నారు. ఇప్పుడు వాటిని బయటకు తీసే పనిని అనేక మంది నిర్వహిస్తున్నారన్నారు. అలా దొడ్డి కొమరయ్య చరిత్ర పై సినిమా తీయడం అభినందనీయమ‌న్నారు. నిర్మాతలకు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సినిమా బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement