అబ్దుల్లాపుర్‌మెట్ (ప్రభ న్యూస్) : అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ్‌లో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గడ్డిఅన్నా రం పండ్ల మార్కెట్ యార్డ్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ- హాస్పటల్‌ను ప్రభుత్వం ఏర్పాటు- చేస్తున్నవిషయం తెలిసిందే. తుర్కయాంజల్ మున్సిపాలి టీ- పరిధి కొహెడలో దసరా పండుగ రోజున మార్కెట్ యార్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్క్‌లో తాత్కాలిక మార్కెట్‌ను శుక్రవారం దసరా రోజున మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, కలెక్టర్ అమెయ్ కుమార్‌లతో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు- చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కొహెడలో అంతర్జాతీ య ప్రమాణాలతో ఆసియాలోనే ఎక్కడా లేనివిధంగా మార్కెట్‌ను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. నగరంలో అన్నివిధాలా ఇబ్బందులు ఉండేవని, ట్రాక్‌లు రాత్రి 10 తర్వాత అనుమతులు ఉండేవని, ఇక్కడ 24 గంటలు సమయంలో ఎప్పుడైనా రావచ్చని గుర్తుచేశారు. గడ్డిఅన్నారం లో హాస్పిటల్ నిర్మాణం ఆలోచన కేసీఆర్‌కు రావటం గొప్ప నిర్ణయంగా భావిస్తున్నట్లు- మంత్రి తెలిపారు. అనంతరం కొహెడ్‌లో లేఅవుట్‌ను పరిశీలించి కొబ్బరి కాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటచారి, ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్, జెడ్పీటీ-సీ బింగిదాస్ గౌడ్, డీసీపీ సన్ ప్రీత్‌సింగ్, స్థానిక సర్పంచ్ ఎర్రవెళ్ళి లత, శ్రీ గౌరీశంకర్ చారి, ఎంపీటీసీ కేశెట్టి వెంకటేష్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ- డైరెక్టర్‌లు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement