రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అంబర్ పేటలోని జీహెచ్ఎంసీ పార్క్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ మొక్కలు నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి 2022వ సంవత్సరం లోకి అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. మొక్కలు నాటే మంచి కార్యక్రమంతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించటం జరిగిందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి వాతావరణం కలిగి కరోనా లాంటి వైరస్ తొలిగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా విరజిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇంతమంచి పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ గౌడ్, ధనంజయ, బంగారు శ్రీను, శ్యామ్, సాయి కుమార్, నరేష్, ప్రశాంత్, వినీత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital